Gruhalaxmi Scheme 2BHK Indiramma illu Houses Benefits 2026
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గృహ లక్ష్మి ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రకారం అందరికి సొంత ఇల్లు అనేది ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉండే చిరకాల కల. ఆ కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా అందరికి ఇందిరమ్మ ఇల్లు స్కీం ను ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం చేయాలంటే ఖర్చు చాల పెరుగుతుంది.
సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుక ఇలా అన్ని మెటీరియల్స్ ఖర్చులు పెరిగాయి. ఈ ధరలతో సొంత ఇల్లు అనే కల కలగానే మిగిలిపోతుంది. సొంత స్థలం ఉండి, ఇల్లు లేనివాళ్ళకు ఈ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఖాళీ స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేస్తారా? లేదా? అనే విషయం ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు లిస్టు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పథకం జాబితాలో గతంలోని గృహలక్ష్మీ దరఖాస్తుదారులను పరిగణలోకి తీసుకోవటం లేదు. గత ప్రభుత్వం హయాంలో ఈ పథకానికి ఎంపికైన వారిలో కొంతమంది పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేయగా మరికొంత మంది అసలు వాటిని ప్రారంభం కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త వారికీ అవకాశం ఇవ్వాలని, కొత్త లిస్టు రెడీ చేసింది.
అన్ని గ్రామ పంచయతిలలో 2024 జనవరిలో ప్రజాపాలన కేంద్రాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, పురపాలిక కార్యాలయాల వద్ద అధికారులు, సిబ్బంది నేరుగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. గ్రామ పాలనలో భాగంగా నిర్వహించిన ఈ పథకంలో ఊహించిన దాని కంటే మించి దరఖాస్తులు వచ్చాయి. మొదటగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులను గుర్తించారు. దానిలో అర్హులను గుర్తించి వాళ్ళకి లాభం అందించే విధంగా అడుగులు ముందుకు వేసింది. బేస్మెంట్ వరకు నిర్మించిన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున ఖాతాల్లో జమ చేస్తున్నారు. మరికొంత మంది పాత ఇళ్లను కూల్చివేయడంతో పాటు అప్పు చేసి ఇంటి నిర్మాణాలను చేపట్టారు. అవి ప్రస్తుతం బేస్మెంట్, స్లాబ్ దశలో అసంపూర్తిగా ఉన్నాయి. ఇంకా కొంచెం పని అయిన వారికీ, పని ప్రకారంగా డబ్బు చెల్లింపులు జరిగాయి.
“గృహలక్ష్మి పథకంలో ప్రొసీడింగ్ పత్రాలు పొందిన వారి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాం. లబ్ధిదారుల ఇళ్లు వివిధ రకాలుగా నిర్మాణ దశలలో ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది” -దామోదర్‌రావు, గృహ నిర్మాణ సంస్థ ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్
“గతంలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు కావడంతో ఆనందంగా పనులు ప్రారంభించాం. కొత్త ప్రభుత్వంలోనైనా నిధులు మంజూరు అవుతాయనే అనే ఆశతో పనులు నిలిపివేసి ఏడాది నుంచి ఎదూరుచూస్తున్నాం. అప్పులు చేసి మరీ ఇల్లు పూర్తి చేసుకున్నాం. మాది వ్యవసాయ కుటుంబం. మాకు ముగ్గురు పిల్లలున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం” -గౌరబోయిన అనూష, నంగునూరు
” ఈసారి గృహ లక్ష్మి ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకు రావడం చాలా సంతోషం. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఆసరాగా ఉంటుందని నమ్ముతున్నాము. – మామిడిపెల్లి సుజాత, మిర్యాలగూడ

Post Comment