SBI లో 8,773 జూనియర్‌ అసోసియేట్‌ ప్రభుత్వ ఉద్యోగాలు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) భారీ ఖాళీలతో క్లర్క్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌(క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు: జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)

మొత్తం పోస్టుల సంఖ్య: 8,773.

హైదరాబాద్‌ సర్కిల్‌ (తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 525.

అమరావతి సర్కిల్‌ (ఆంధ్రప్రదేశ్‌)లో పోస్టుల సంఖ్య: 50.




విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.04.2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1995 – 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

బేసిక్‌ పే: నెలకు రూ.19,900.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు జరుగుతుంది.  పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.




మెయిన్‌ ఎగ్జామ్‌: మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు… 50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు… 40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు… 50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు… 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 17, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  డిసెంబర్ 07, 2023

ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024లో జరుగుతుంది.

మెయిన్‌ పరీక్ష తేది: ఫిబ్రవరి 2024లో జరుగుతుంది.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

_______________________