తెలంగాణలో 5,089 ఉపాధ్యాయ ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ /  టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ సెప్టెంబరు 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. సెప్టెంబరు 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు. TS DSC TRT Recruitment Notification 2023

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join telegram – Click here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు & ఖాళీలు: డీఎస్సీ / టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ): 5,089 పోస్టులు

ఖాళీలు: మొత్తం 5,089 ఖాళీల్లో ఎస్‌జీటీ- 2,575 పోస్టులు; స్కూల్‌ అసిస్టెంట్‌- 1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్- 611 పోస్టులు, పీఈటీ- 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358, నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హనుమకొండలో 53 ఖాళీలు ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.




జిల్లాల వారీగా ఖాళీలు: 

* ఆదిలాబాద్: 275

* ఆసిఫాబాద్: 289

* భద్రాద్రి కొత్తగూడెం: 185

* హనుమకొండ: 54

* హైదరాబాద్: 58

* జగిత్యాల: 148

* జనగాం: 76

* జయశంకర్ భూపాలపల్లి: 74

* జోగులాంబ: 146

* కామారెడ్డి: 200

* కరీంనగర్: 99

* ఖమ్మం: 195




* మహబూబాబాద్: 125

* మహబూబ్ నగర్: 96

* మంచిర్యాల: 113

* మెదక్: 147

* మేడ్చల్: 78

* ములుగు: 65

* నాగర్ కర్నూల్: 114

* నల్గొండ: 219

* నారాయణపేట: 154

* నిర్మల్: 115

* నిజామాబాద్: 309

* పెద్దపల్లి: 43

* రాజన్న సిరిసిల్ల: 103

* రంగారెడ్డి: 196

* సంగారెడ్డి: 283

* సిద్దిపేట: 141

* సూర్యాపేట: 185

* వికారాబాద్: 191

* వనపర్తి: 76

* వరంగల్: 138

* యాదాద్రి: 99




అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

జీత భత్యాలు:  బేసిక్ పే రూ. 30,000 – 1,80,000/- ;

రాతపరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్ (సీబీఆర్‌టీ) పద్ధతిలో జరుగుతుంది.

పరీక్ష తేదీలు: నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ  (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్ష కేంద్రాలు: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుం: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 21 , 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Note – పూర్తి వివరాలు ఉన్న నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 పైన విడుదల అవుతుంది.

******************

More Jobs:




TS DSC 2023 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

TS DSC 2023 కోసం దరఖాస్తు చేయడానికి క్రింది దశలు ఉన్నాయి లేదా ఎగువ విభాగంలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేయడానికి మేము ప్రత్యక్ష లింక్‌ను ప్రస్తావిస్తాము.

దశ 1- డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.inకి వెళ్లండి.

దశ 2- హోమ్‌పేజీలో, “నోటిఫికేషన్” లేదా “రిజిస్ట్రేషన్” లింక్‌పై క్లిక్ చేయండి.

దశ 3- అప్లికేషన్‌ను కొనసాగించే ముందు సూచనలను మరియు మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవండి.

దశ 4- దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు మరియు పని అనుభవంతో సహా అవసరమైన వివరాలను పూరించండి.

దశ 5- సూచనలలో పేర్కొన్న నిర్ణీత ఫార్మాట్ మరియు సైజు ప్రకారం విద్యా ధృవీకరణ పత్రాలు, గుర్తింపు రుజువు మరియు పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటోగ్రాఫ్‌లు వంటి అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.

దశ 6- దరఖాస్తును సమర్పించే ముందు TS DSC TRT నోటిఫికేషన్ 2023లో నమోదు చేసిన మొత్తం సమాచారాన్ని మరియు అప్‌లోడ్ చేసిన పత్రాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.

దశ 7- సమర్పించిన తర్వాత, రిజిస్ట్రేషన్ నంబర్‌ను నోట్ చేసుకోండి లేదా భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్ నిర్ధారణ పేజీ ప్రింటవుట్ తీసుకోండి.

దశ 8- రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు మరియు నోటిఫికేషన్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా మీ రిజిస్టర్డ్ ఇమెయిల్‌ను తనిఖీ చేస్తూ ఉండండి.

దశ 9- మీ రికార్డుల కోసం పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ మరియు చెల్లింపు రసీదు యొక్క ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.

TS DSC TRT Recruitment Notification 2023.