రైతాంగ, గిరిజన ఉద్యమాలు Tribal Movements in Independence

సిపాయిల తిరుగుబాటు అనేది, భారత దేశ స్వాతంత్ర విజయాలలో మొదటిది. 1857 సిపాయిల తిరుగుబాటు భారత చరిత్రలో ఒక గొప్ప మలుపు. ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేసినప్పటికీ, భారతీయులలో మనకు స్వతంత్రం కావాలనే  కాంక్షను, చైతన్యాన్ని ఇది మరింత రగిల్చింది. 1857 తర్వాత దేశంలో ఒకవైపు రైతాంగ, గిరిజన ఉద్యమాలు ఉధృతం కాగా, మరోవైపు సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించడానికి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలు వెల్లువలా సాగాయి. బ్రిటిష్ వారితో విప్లవాలు చేస్తూ, ఒక పక్క మన ప్రజలకు సమాజంలో రావాల్సిన మార్పులను తీసుకొని వచ్చారు. ఈ ఉద్యమాలలో రైతుల సేవ వేల కట్టలేనిది. వాళ్ళ పోరాట పలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం.

రైతాంగ మరియు గిరిజన ఉద్యమాలు (Peasant & Tribal Movements)

  • నీలిమందు విప్లవం (Indigo Revolt – 1859-60)
  • పబ్నా రైతాంగ ఉద్యమం (Pabna Agrarian Leagues – 1873)
  • దక్కన్ అల్లర్లు (Deccan Riots – 1875)
  • రాంపా తిరుగుబాటు (Rampa Rebellion – 1879)
  • ముండా తిరుగుబాటు / ఉల్గులన్ (Munda Rebellion – 1899-1900

నీలిమందు విప్లవం (Indigo Revolt – 1859-60): 

నీలి మందు విప్లవం అప్పుడే అంటిన చిచ్చుకు వజ్యం పలికినట్లు అయింది. ఇది బెంగాల్ లోనే నాదియా జిల్లలో మొదలు అయింది. దీనికి భిశ్వసు కుటుంబం నాయకత్వం వహించారు. నీలి మందు విప్లవం లో ప్రధాన ప్రాత్ర పోషించిన నాయకులు, దిగంబర్ బిశ్వాస్, విష్ణు బిశ్వాస్. ఇది యురోపియన్ తోటల యజమానులకు , బెంగాల్ రైతులకు మధ్య జరిగిన విప్లవం. రైతులు ఆహార అవసర నిమిత్తం పండించుకునే, వరి, మక్క, జొన్నలు లకు బదులుగా, బలవంతంగా నీలిమందు ని పండించాలని ఒత్తిడి తెచ్చేవారు. మరియు, దానికి సరైన మద్దతు ధర ఇవ్వకుండా, పంటను లక్కునేవారు. దిని వాళ్ళ రైతులు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయారు. దీనికి వ్యతిరేకంగా బెంగాల్ రైతులు నీలి మందు విప్లవం చేసారు.

  • నీలి మందు విప్లవం జరిగిన  ప్రాంతం: బెంగాల్ (నాదియా జిల్లా)

  • నేపథ్యం: బలవంతంగా నీలిమందు (Indigo) పండించాలని, దీనికి రైతులు సమ్మె చేసారు.

  • ప్రత్యేకత: ఈ ఉద్యమానికి బెంగాలీ మేధావుల మద్దతు లభించింది. దీనబంధు మిత్ర రాసిన ‘నీల్ దర్పణ్’ అనే నాటకం రైతుల కష్టాలను కళ్లకు కట్టింది. దీని ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఇండిగో కమిషన్’ వేసింది.

నీలిమందు విప్లవం గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు ఒకసారి చూద్దాం

  1. ప్రశ్న. నీలిమందు విప్లవం జరిగిన ప్రదేశం ?
  2. నీలిమందు పంటవల్ల రైతులకు జరిగే నష్టాన్ని, కళ్ళకు కట్టినట్లు చూపించింది ఎవరు ? ఎలా ?
  3. నీలిమందు విప్లవం లో, ప్రధాన నాయకులూ ఎవరు ?

జవాబులు

  1. నాదియా జిల్లా, బెంగాల్ రాష్టం
  2. నీలి దర్పణ్, నాటకం రాసింది దీనబంధు మిత్ర
  3. దిగంబర్ బిశ్వాస్, విష్ణు బిశ్వాస్

పబ్నా రైతాంగ ఉద్యమం (Pabna Agrarian Leagues – 1873):

పబ్నా రైతాంగ ఉద్యమం బ్రిటిష్ పాలనలో జమీందారుల దోపిడీ, అధిక కౌలు వసూళ్లు, అక్రమ పన్నులకు వ్యతిరేకంగా రైతులు చేసిన శాంతియుత ఉద్యమం.

1. అధిక కౌలు వసూళ్లు

జమీందారులు చట్టబద్ధమైన కౌలు కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసేవారు.

2. అక్రమ పన్నులు (అబ్వాబ్)

ప్రభుత్వ పన్నులతో పాటు అనేక అక్రమ రుసుములు కూడా రైతులపై విధించేవారు.

3. బలవంతపు భూముల స్వాధీనం

కౌలు చెల్లించలేకపోతే రైతులను భూముల నుంచి వెళ్లగొట్టేవారు.

4. బ్రిటిష్ ప్రభుత్వ మద్దతు

జమీందారులకు ప్రభుత్వ సహకారం ఉండటం వల్ల రైతులకు న్యాయం దొరకడం కష్టమయ్యేది.

5. రైతుల పేదరికం

పంటలు సరిగా పండకపోయినా కౌలు మాత్రం పెంచడం వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోయారు.

ప్రాంతం: తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)

నాయకులు: ఈశాన్ చంద్ర రాయ్, శంభు పాల్.

అంశం వివరాలు
ఉద్యమం పేరు పబ్నా రైతాంగ ఉద్యమం
కాలం 1873–1876
ప్రాంతం పబ్నా జిల్లా (ప్రస్తుత బంగ్లాదేశ్)
ప్రధాన కారణం జమీందారుల దోపిడీ, అధిక కౌలు
ఉద్యమ స్వభావం శాంతియుత రైతు ఉద్యమం
ప్రధాన డిమాండ్ అధిక కౌలు రద్దు, రైతుల హక్కుల రక్షణ
ముఖ్య ఫలితం బెంగాల్ టెనెన్సీ చట్టం (1885)కు పునాది

పరీక్షల కోసం ముఖ్యమైన MCQs

1. పబ్నా రైతాంగ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
A) 1857
B) 1873 ✅
C) 1885
D) 1905

2. పబ్నా రైతాంగ ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగింది?
A) బీహార్
B) ఒడిశా
C) పబ్నా (ప్రస్తుత బంగ్లాదేశ్) ✅
D) పంజాబ్

3. పబ్నా ఉద్యమం ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది?
A) ఫ్రెంచ్ పాలకులు
B) జమీందారులు ✅
C) మరాఠాలు
D) నిజాం

4. పబ్నా ఉద్యమం ఏ స్వభావం కలిగిన ఉద్యమం?
A) సాయుధ పోరాటం
B) గిరిజన తిరుగుబాటు
C) శాంతియుత రైతాంగ ఉద్యమం ✅
D) కార్మిక ఉద్యమం

5. పబ్నా ఉద్యమం ప్రభావంతో అమలులోకి వచ్చిన చట్టం ఏది?
A) పర్మనెంట్ సెటిల్మెంట్
B) రౌలట్ చట్టం
C) బెంగాల్ టెనెన్సీ చట్టం (1885) ✅
D) రెగ్యులేటింగ్ చట్టం

నేపథ్యం: జమీందారులు అక్రమంగా పన్నులు పెంచడం, రైతులను భూములనుంచి వెళ్లగొట్టడానికి వ్యతిరేకంగా రైతులు లీగ్‌లుగా ఏర్పడి న్యాయపోరాటం చేశారు.

దక్కన్ అల్లర్లు (Deccan Riots – 1875):

దక్కన్ రైతాంగ ఉద్యమం అనేది బ్రిటిష్ పాలనలో సాహుకారుల (వడ్డీ వ్యాపారులు) దోపిడీ, అధిక వడ్డీ రేట్లు, అప్పుల భారం, భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా రైతులు చేసిన తిరుగుబాటు.

ప్రాంతం: మహారాష్ట్ర (పూణే, అహ్మద్ నగర్)

నేపథ్యం: గుజరాతీ, మార్వాడీ వడ్డీ వ్యాపారుల (Money lenders) భారీ వడ్డీల భారంతో రైతులు అప్పులపాలయ్యారు. కోపంతో రైతులు వడ్డీ వ్యాపారుల ఇళ్లు, బాండ్ పత్రాలను తగులబెట్టారు. ప్రభుత్వం దీనికోసం ‘దక్కన్ అగ్రీకల్చరిస్ట్స్ రిలీఫ్ యాక్ట్ (1879)’ తెచ్చింది.

అంశం వివరాలు
ఉద్యమం దక్కన్ రైతాంగ ఉద్యమం
సంవత్సరం 1875
ప్రాంతం పూణే, అహ్మద్‌నగర్ (బొంబాయి ప్రెసిడెన్సీ)
ప్రధాన కారణం అప్పుల భారం, సాహుకారుల దోపిడీ
వ్యతిరేకంగా సాహుకారులు (Moneylenders)
ప్రధాన ఫలితం దక్కన్ అగ్రికల్చరిస్ట్స్ రిలీఫ్ చట్టం – 1879

ముఖ్యమైన MCQs

1. దక్కన్ రైతాంగ ఉద్యమం ఎప్పుడు జరిగింది?

A) 1857
B) 1873
C) 1875 ✅
D) 1885

2. దక్కన్ రైతాంగ ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగింది?

A) బెంగాల్
B) పంజాబ్
C) మహారాష్ట్ర (పూణే–అహ్మద్‌నగర్) ✅
D) బీహార్

3. ఈ ఉద్యమం ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది?

A) జమీందారులు
B) బ్రిటిష్ సైన్యం
C) సాహుకారులు (Moneylenders) ✅
D) నవాబులు

4. దక్కన్ రైతాంగ ఉద్యమం ఫలితంగా ఏ చట్టం అమలులోకి వచ్చింది?

A) బెంగాల్ టెనెన్సీ చట్టం
B) పర్మనెంట్ సెటిల్మెంట్
C) దక్కన్ అగ్రికల్చరిస్ట్స్ రిలీఫ్ చట్టం, 1879 ✅
D) రౌలట్ చట్టం

5. దక్కన్ రైతాంగ ఉద్యమానికి ప్రధాన కారణం ఏది?

A) మత వివాదాలు
B) విద్యా సమస్యలు
C) అప్పుల భారం మరియు అధిక వడ్డీ వసూళ్లు ✅
D) పారిశ్రామికీకరణ

రాంపా తిరుగుబాటు (Rampa Rebellion – 1879):

రంపా ఉద్యమం (మన్యం ఉద్యమం) అనేది ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత, అటవీ చట్టాలు మరియు బలవంతపు కూలీ (వెట్టి) విధానానికి వ్యతిరేకంగా చేసిన సాయుధ పోరాటం. తూర్పు కనుమలలోని రంపా ప్రాంతం (ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు పరిసర ప్రాంతాలు జరిగింది. 1922లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో గిరిజనులు సాయుధ పోరాటం ప్రారంభించారు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి వంటి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అడవులను కేంద్రంగా చేసుకుని గెరిల్లా యుద్ధ పద్ధతిని అనుసరించారు. బ్రిటిష్ సైన్యానికి రెండేళ్లపాటు గట్టి సవాలు విసిరారు. అల్లూరి సీతారామరాజును పట్టుకుని 1924 మే 7న కాల్చి చంపింది.

అంశం వివరాలు
ఉద్యమం రంపా ఉద్యమం (మన్యం ఉద్యమం)
కాలం 1922–1924
ప్రాంతం రంపా ప్రాంతం (ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా)
నాయకుడు అల్లూరి సీతారామరాజు
ప్రధాన కారణం అటవీ చట్టాలు, వెట్టి చాకిరి, అధికారుల వేధింపులు
ఉద్యమ స్వభావం సాయుధ గిరిజన ఉద్యమం
ముగింపు 1924లో అల్లూరి సీతారామరాజు వీరమరణం

ప్రాంతం: ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం, గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు)

నేపథ్యం: గిరిజనుల సంప్రదాయ హక్కులను హరించే కొత్త అటవీ చట్టాలకు, ముఠాదార్ల (బ్రిటిష్ ఏజెంట్లు) దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు తిరుగుబాటు చేశారు.

ముండా తిరుగుబాటు / ఉల్గులన్ (Munda Rebellion – 1899-1900):

ముండా తిరుగుబాటు లేదా ఉల్గులాన్ (Ulgulan – మహా తిరుగుబాటు) అనేది బ్రిటిష్ పాలన, జమీందారుల దోపిడీ, అటవీ చట్టాలు మరియు భూమి హక్కుల హరణకు వ్యతిరేకంగా ముండా గిరిజనులు చేసిన గొప్ప ఉద్యమం. బిర్సా ముండా ముండా గిరిజనులను ఐక్యం చేశారు. “అబువా దిశుం, అబువా రాజ్” (మన భూమి – మన పాలన) అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచారు. సామాజిక సంస్కరణలతో పాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపించారు. గిరిజనుల హక్కుల కోసం సాయుధ ఉద్యమానికి నాయకత్వం వహించారు. గిరిజనుల సంప్రదాయ ఉమ్మడి వ్యవసాయ వ్యవస్థ (ఖుంట్‌కట్టి) స్థానంలో జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల ఈ విప్లవం వచ్చింది.

ప్రాంతం: చోటానాగ్‌పూర్ ప్రాంతం (ప్రస్తుత జార్ఖండ్)

నాయకుడు: బిర్సా ముండా (ఈయన్ని గిరిజనులు ‘ధరతీ ఆబా’ లేదా భూమి తండ్రి అని పిలుస్తారు).

అంశం వివరాలు
ఉద్యమం ముండా తిరుగుబాటు (ఉల్గులాన్)
కాలం 1899–1900
ప్రాంతం చోటానాగ్‌పూర్ (ప్రస్తుత జార్ఖండ్)
నాయకుడు బిర్సా ముండా
ప్రధాన కారణం భూమి హక్కుల హరణ, అటవీ చట్టాలు, వెట్టి చాకిరి
ముఖ్య ఫలితం చోటానాగ్‌పూర్ టెనెన్సీ చట్టం (1908)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *