ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీ సెట్‌) – 2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్‌) – 2024 ఏప్రిల్ 28న జరగనుంది. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఏయూ చూస్తోంది. జనరల్‌ స్టడీస్‌, 30 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్‌)-2024

సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్‌- ఓషన్ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.




అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష రుసుం: జనరల్/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.1200. బీసీ కేటగిరీకి రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.700.




ముఖ్య తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 14, 2024

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 06, 2024

పరీక్ష తేదీ: 28-04-2024.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

**************************

More Jobs: