ఇందిరమ్మ ఇళ్ళకు AE లు OK అంటే బేస్మెంట్ కి లక్ష రెడీ

INDIRAMMA ILLU

ఇందిరమ్మ ఇల్లు నియమాలు : తెలంగాణా గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు 2BHK గృహలక్ష్మి పథకం రెండవ లబ్దిదారుల లిస్టు PDF రాష్ట ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణాలకు ముగ్గులు పోశారు. బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసేవరకు మొదటి విడతగా, ఇంటి నిర్మాణం చెప్పటిన వారికీ లక్ష చొప్పున జమ చేస్తాము అని చెప్పిన విధంగా, ఆ నిర్మాణాలకు సంబంధించి ఆ ఊరుకి సంబందించిన గ్రామ పంచాయతి కార్యదర్శితో పాటు గవర్నమెంట్ అప్పాయింట్ చేసిన AE (అసిస్టెంట్ ఇంజనీర్ ) పరిశీలించి సైట్ ఫొటోస్ తీసి గృహలక్ష్మి అప్ లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత లబ్బిదారుడి బ్యాంకు ఖాతా వివరాలు పంపడంతో అన్ని వెరిఫై చేసి, బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయిలు, స్లాబ్ వరకు గోడల నిర్మాణానికి లక్ష, స్లాబ్ వేసిన తరువాత రూపాయిలు 2 లక్షలు మిగతా పనులు పూర్తి చేసిన తరువాత లక్ష చెల్లిస్తారు.

ఇందిరమ్మ ఇల్లు లబ్బిదారుల లిస్టు తెలంగాణా 2nd లిస్టు

ఈ వెరిఫికేషన్ లబ్బిదారుల పక్రియ ని మరింత వేగవంతం చేయడానికి, తెలంగాణా గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కోసం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 390 ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. సుమారు 10 వేల అప్లికేషన్లు వచ్చాయి. ఇటీవలే సెలక్షన్ కూడా పూర్తైంది. ఈ నెల 23న వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఇక మే ఫస్ట్ వీక్ నుంచి కొత్త ఏఈలు విధుల్లోకి దిగనున్నారు. కొత్త ఏఈ లా రాకతో, ఈ పక్రియ మరింత సులభం కాబోతుంది.

ప్రతి లబ్దిదారునికి ఈ స్కీం యొక్క, డబ్బులు వాళ్ళ బ్యాంకు ఎకౌంటు లో పడాలి. కొత్తగా వచ్చిన ఏఈ లను హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ర్టక్షన్ ఆఫీసులో కొత్త ఏఈలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వారం పాటు ఈ శిక్షణ ఉంటుంది. దీనికి సంబందించిన అన్ని వివరాలు అక్కడే అందచేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రాధాన్యత, అప్లికేషన్లు, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై కొత్త ఏఈలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వీరికి జీతం నెలకు 33,800. సివిల్ ఇంజనీర్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లను మార్కుల్లో మెరిట్ ఆధారంగా రిక్రూట్ మెంట్ చేశారు. గృహలక్ష్మి రెండవ విడతలో భాగంగా సొంత ఇంటి కలకి సర్వం సిద్దం అనే చెప్పాలి.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సొంత ఇంటి ఇందిరమ్మ ఇళ్లలో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా మందికి సరైన అవగాహనా లేక, గృహ లక్ష్మి కి వర్తించే నియమాలు, దాని లిమిట్స్ తెలియక ఎలా పడితే అలానే ఇంటి పని స్టార్ట్ చేసారు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. గవర్నమెంట్ చాలా రూల్స్ పెడుతుంది, దానిలో ఏ ఒక్కటి నియమాలకు విరుద్దంగా ఉన్న, వాళ్ళ పేర్లు లిస్టు లో నుండి తీసేసి అవకాశం ఉంది. తెలంగాణ ఇంద్రమ్మ ఇండ్లు కు ఎలా అప్లై చేయాలి దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఇంటి కొలతలు స్లాబ్ ఏరియా వింటేరియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా వేగవంతంగా జరుగుతుంది.

ఇందిరమ్మ ఇల్లు ఎంత వరకు కట్టుకోవచ్చు ?

కాంగ్రెస్ – తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సొంత ఇంటి పథకం కి, ఇల్లు ఏరియా 400 SQF నుండి 600 SQF మధ్యలో ఉండాలి. ఇది కూడా ప్లింత్ ఏరియా మాత్రమే. ప్లింత్ ఏరియా అనగా, కేవలం ఇల్లు వచ్చిన స్థలం మాత్రమే, మెట్లు, పైన స్లాబ్ అనేది దేని లెక్క లోకి రాదు. 400కి తగ్గకుండా, రెండు రూమ్స్ , ఒక కిచెన్, ఒక బెడ్ రూమ్, ఒక బాత్రూం వచ్చేలా ఇల్లు కట్టుకోవాలని గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత వివరాలు
ప్రతి నియోజకవర్గానికి 1000 ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది లబ్ధిదారుల జాబితాను అధికారులు దగ్గర ఉంది వేగంగా సర్వం సిద్ధం చేస్తున్నారు మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు అలాగే రెండో విడత జాబితా కూడా విడుదల చేశారు దాంట్లో లబ్ధిదారుల పేర్లు చూసుకోవచ్చు మొదటి విడతలో లేని వారి పేర్లు రెండో విడతలు వచ్చే అవకాశం ఉన్నందున తెలంగాణ ఇందిరమ్మండ్లకు ఎవరైతే అప్లై చేశారో వాళ్లు అందరూ రెండో విడత లిస్టులో పేర్లు చెక్ చేసుకోగలరు మొదటి విడతలు కొన్ని తప్పులు జరిగాయని అధికారులు గమనించి వాటిని పునావృతం కాకుండా తప్పులను సర్దిర్తే కార్యక్రమాలు చేపట్టారు.

మొదటి విడత ఇంద్రమిల్లిలో భాగంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 72,000 మందిని లబ్ధిదారుల గుర్తించారు అయితే అందులో చాలామంది సొంత ఇల్లు ఉన్నా కూడా మొదటి విడతలో వాళ్ళ పేర్లు రావడం తో, రావడంతో అది కొద్దిగా దుమారం లేపుతుంది రెండో విడతలు అలాంటి తప్పులు ఏం జరగకుండా జాగ్రత్త పడ్డారు. రెండో విడతలు వచ్చిన వాళ్లకు త్వరలోనే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది

 

Post Comment