తెలంగాణ అంగన్‌వాడీ టీచర్ ఆయా పోస్ట్స్ ఉద్యోగ భర్తీ వివరాలు 2026

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం వీటిలో దాదాపు 71,562 మంది ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారు. అంగన్వాడి ఉద్యోగాల కోసం అయినా నోటిఫికేషన్ విడుదల అయింది. దాని వివరాలు తెలుసుకుందాం.

తెలంగాణ అంగన్‌వాడీ నోటిఫికేషన్ 2026: భారీగా ఉద్యోగ ఖాళీలు

ఈసారి పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ పోస్ట్స్ రానుయ్యాయి. ఎందుకంటే,గత మూడేళ్లలో ఉద్యోగుల పదవీ విరమణలు పెరిగాయి. చాలా మంది వయసు రిత్యా విరమణ పొందండం జరిగింది.అలాగే చాలా మందికి సూపర్వైజర్ ఉద్యోగాలుగా పదోన్నతులు లభించాయి. దాని కారణంగా ఇప్పుడు చాలా పోస్ట్స్ ఖాలిగా ఉన్నాయి. వాటికీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరికొందరికి ఇతర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ఇందువల్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం అంగన్‌వాడీల్లో 22.33 శాతం ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఖాళీలను 2025-26 ఏడాదికి అనుగుణంగా భర్తీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ తో చాలా వరకూ ఉద్యోగాలు ఫిల్ చేయాలనీ ప్లాన్ చేయడం జరిగింది. అధికారులు జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్లను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా టీచర్, ఆయా పోస్టులను సమానంగా భర్తీ చేస్తారు.మరోవైపు, ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలను పూర్తిగా మారుస్తోంది. ఇందులో భాగంగా 3300 కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు ఇస్తున్నారు. అలాగే, సుమారు 9000 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. వీటితో పాటు 7700 కేంద్రాలలో మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. ఇంకా, 1000 కేంద్రాలకు ప్రభుత్వం సొంతంగా శాశ్వత భవనాలను నిర్మిస్తోంది. అలాగే 5000 కేంద్రాలలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.

అంగన్‌వాడీ ఉద్యోగాల అర్హతలు

ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా, వారు స్థానిక మరియు వివాహితులైన మహిళలై ఉండాలి. అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అంగన్‌వాడీ ఆయా పోస్టులకు పదో తరగతి అర్హత అవసరం. మరోవైపు, అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. Age గురించి సవరణలు చేసే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాల భర్తీ పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే జరుగుతుంది. అధికారులు పూర్తి ఎంపిక ప్రక్రియను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నిర్వహిస్తారు. అలాగే, ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల ఇంటర్, టెన్త్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ మార్కుల ప్రతిభ ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు.అర్హులైన మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. తెలంగాణా లో అంగన్వాడి ఉద్యోగాలు త్వరలో పెద్ద సంఖ్యలో వస్తాయి అనేది 100% మిగతా వివరాల కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

Post Comment