ఇందిరమ్మ సొంతిటి కల నెరవేరడానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న స్కీం వివరాలు. ఇందిరమ్మ ఇండ్ల పథకం (Indiramma Indlu Scheme) కింద ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడానికి కావలసిన స్థలం వివరాలు మరియు నియమ నిబంధనల గురించి కింద స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసిన వాళ్ళు, నిర్మాణం చేసేవాళ్ళు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి.
ఇందిరమ్మ ఇల్లు పథకంలో స్థలం ఎంత ఉండాలి?
గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇందిరమ్మ ఇల్లుకి ఉండవలసిన రూల్స్ . కనీస స్థలం ఉండవలసింది ఎంత ? ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకోవడానికి స్థలానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వివరాలు.
-
సొంత స్థలం ఉన్నవారికి:
మీ వద్ద కనీసం 75 చదరపు గజాలు (75 Sq. Yards) నుండి 100 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ స్థలం ఉండాలి.
స్థలం మీ పేరు మీద గానీ, లేదా కుటుంబ సభ్యుల పేరు మీద గానీ స్పష్టమైన టైటిల్ (యాజమాన్య హక్కులు) కలిగి ఉండాలి.
ఈ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ₹5,00,000 (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని వివిధ దశల్లో అందిస్తుంది.
Also Read: Indiramma Illu Installment Release Date 2026

-
స్థలం లేని నిరుపేదలకు:
సొంత స్థలం లేని అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు (House Site Plot) ఇల్లు కట్టుకోవడానికి ₹5,00,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
Also Read: Indiramma Illu 2nd List Release Date Telangana
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వైశాల్యం (Built-up Area)
ప్రభుత్వం సూచించిన నమూనా (Model Plan) ప్రకారం ఇంటి నిర్మాణం ఉండాలి:
-
కనీస నిర్మాణ విస్తీర్ణం: కనీసం 400 చదరపు అడుగులు (Sq. Ft.) ఉండేలా నిర్మాణం చేపడుతారు.
-
ఇంటి నిర్మాణం వివరాలు:
-
ఒక లివింగ్ రూమ్ (హాలు)
-
ఒక బెడ్రూమ్ (పడకగది)
-
ఒక వంటగది (కిచెన్)
-
ఒక మరుగుదొడ్డి మరియు స్నానాల గది (Attached/Combined Toilet & Bathroom)
-

పథకానికి అర్హతలు (Eligibility Criteria)
-
స్థానికత/Locality: తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి.
-
ప్రజా పాలన దరఖాస్తు/Application Form: ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసి ఉండాలి.
-
రేషన్ కార్డు: చెల్లుబాటు అయ్యే తెల్ల రేషన్ కార్డు (White Ration Card / BPL Card) కలిగి ఉండాలి.
-
ఇంతకుముందు లబ్ధి పొంది ఉండకూడదు: గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి పక్కా ఇల్లు లేదా హౌసింగ్ స్కీమ్ పొంది ఉండకూడదు.
-
మహిళల పేరిట: ఇంటి మంజూరు ప్రధానంగా కుటుంబంలోని మహిళల పేరిటే ఇవ్వబడుతుంది.
Also Read: Indiramma Indlu Beneficiary List 2026 Online

ఆర్థిక సహాయం అందించే దశలు (Financial Assistance Stages)
మొత్తం ₹5,00,000 లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో విడతల వారీగా జమ చేయబడుతుంది. INSTALLEMENT Modes
-
మొదటి విడత (Base Level / Basement): పునాది దశ పూర్తయిన తర్వాత.
-
రెండవ విడత (Lintel Level): గోడల నిర్మాణం పూర్తయి, లెంటల్ స్థాయికి వచ్చినప్పుడు.
-
మూడవ విడత (Roofing Level): స్లాబ్ (ఆర్.సి.సి లేదా పెంకుటిల్లు/షెడ్) పూర్తయిన తర్వాత.
-
నాలుగు విడత (Completion Stage): ప్లాస్టరింగ్, విద్యుద్దీకరణ, తలుపులు-కిటికీలు మరియు రంగులు పూర్తి అయిన తర్వాత.

కావలసిన ముఖ్యమైన పత్రాలు (Documents Required)
-
ఆధార్ కార్డు (Aadhaar Card)
-
తెల్ల రేషన్ కార్డు (Ration Card)
-
సొంత స్థలం ఉన్నట్లయితే స్థలానికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ / రిజిస్ట్రేషన్ కాగితాలు / ప్లాట్ డాక్యుమెంట్లు
-
బ్యాంక్ ఖాతా వివరాలు (Passbook Copy)
-
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
-
మొబైల్ నంబర్
ముఖ్య గమనిక: మీ గ్రామంలో లేదా మున్సిపాలిటీ పరిధిలో ఈ పథకానికి సంబంధించిన సర్వే అధికారుల పరిశీలన ఆధారంగా అప్లికేషన్ ఆమోదించబడుతుంది. స్థలం సరిహద్దులు, వివరాలపై మీ గ్రామ పంచాయతీ / వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చు.
