తెలంగాణ లో అందరికి ఇల్లు అనే పథకం కింద ఇందిరమ్మ ఇల్లు స్కీం తీసుకొనిరావడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని నిరీక్షిస్తున్న పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్టంలో ఉన్న అన్ని గ్రామాలూ, మండలాలు , జిల్లాల వారిగా ఇందిరమ్మ అర్హుల లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ‘ఇందిరమ్మ ఫ్లాట్స్ – 2026’ పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు ఆధునిక వసతులతో కూడిన బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ ఫ్లాట్లను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇక్కడ అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం, దరఖాస్తు విధానం, అర్హతలు మరియు ప్రభుత్వ సబ్సిడీ వివరాలను విస్తృతంగా ఇక్కడ తెలుసుకుందాం.
ఇందిరమ్మ ఇల్లు హైదరాబాద్ ముఖ్యమైన తేదీలు & ప్రారంభ వివరాలు
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: జులై 21, 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10, 2026
- మొదటి విడత ఫ్లాట్లు: 7,680
- ప్రారంభ ప్రాంతాలు: CURE (Core Urban Region Economy) పరిధిలోని 16 ముఖ్య నియోజకవర్గాలు
🏢 పథకం ప్రత్యేకతలు & నివాస ప్రమాణాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు భిన్నంగా, హైదరాబాద్‌లోని స్థల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ (G+ టవర్ల) విధానంలో వీటిని నిర్మిస్తున్నారు. స్థలం పరిమితులలో భాగంగా CURE పద్దతిని ప్రవేశపెట్టారు.
- ఫ్లాట్ విస్తీర్ణం: 528 చదరపు అడుగులు (Sft) – రెండు పడక గదుల, 2బెడ్ రూమ్ , 1 హాల్, 1 కిచెన్
- మౌలిక సదుపాయాలు: 24/7 తాగునీటి సరఫరా, విద్యుత్, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు పార్కింగ్ వసతులు.
- యాజమాన్య హక్కులు: ఫ్లాట్‌తో పాటు స్థలానికి సంబంధించిన చట్టబద్ధమైన హక్కులను లబ్ధిదారుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసి అందిస్తారు.
- భవిష్యత్ విస్తరణ: అవసరాన్ని బట్టి రాబోయే దశల్లో మరిన్ని నియోజకవర్గాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Also Read: Indiramma Illu 2nd List Release Date Telangana
ఇందిరమ్మ ఇల్లు INSTALLEMENTs Wise (Financial Structure)
ప్రభుత్వం పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేలా భారీ సబ్సిడీని ప్రకటించింది:
| వివరాలు | ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం |
| ప్రభుత్వ సబ్సిడీ | ₹5,00,000 |
| లబ్ధిదారుని వాటా | ₹6,00,000 |
| దరఖాస్తు టోకెన్ అడ్వాన్స్ | ₹10,00,000 |
టోకెన్ అడ్వాన్స్ (₹10,000) నిబంధనలు:
-
ఎంపికైన వారికి: లాటరీ ద్వారా ఫ్లాట్ లభించిన అభ్యర్థుల ₹10,000 టోకెన్ మొత్తాన్ని వారు చెల్లించాల్సిన లబ్ధిదారుని వాటా (₹6 లక్షలు)లో సర్దుబాటు చేస్తారు.
-
ఎంపిక కాని వారికి: పారదర్శక డ్రా విధానంలో పేరు రాని వారికి, దరఖాస్తు సమయంలో చెల్లించిన ₹10,000 మొత్తాన్ని ఎలాంటి కోతలు లేకుండా పూర్తిగా రిఫండ్ (వెనక్కి) చేస్తారు.
Read: Indiramma Illu Status Check by Aadhaar Card: Complete Guide 2026
Eligibility & అర్హత ప్రమాణాలు
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు క్రింది నిబంధనలను కలిగి ఉండాలి:
-
Residential Area / నివాస ప్రాంతం: అభ్యర్థులు తప్పనిసరిగా CURE (Core Urban Region Economy) పరిధిలో నివసిస్తూ ఉండాలి.
-
సొంత ఇల్లు ఉండకూడదు: హైదరాబాద్ లేదా తెలంగాణలో ఎక్కడా సొంత ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ ఉండకూడదు.
-
Financial Position/ ఆర్థిక స్థితి: కేవలం ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) కుటుంబాలు మాత్రమే అర్హులు.
-
కుటుంబ పరిమితి: ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
-
Caste Wise Reservation/ రిజర్వేషన్లు: ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం నిబంధనల ప్రకారం వర్గాల వారీగా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
Read: Indiramma illu Hyderabad CURE Apply With 100Rupees Process
Rules & Regulations – Do’s & Don’t
పథకం దుర్వినియోగం కాకుండా, నిజమైన నిరుపేదలకే ప్రయోజనం అందేలా ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది:
అమ్మకంపై నిషేధం: కేటాయించిన ఫ్లాట్‌ను 10 సంవత్సరాల వరకు ఇతరులకు విక్రయించడానికి లేదా బదిలీ చేయడానికి వీలులేదు.
అద్దెకు ఇవ్వకూడదు: ఈ ఫ్లాట్లను ఇతరులకు కిరాయికి (అద్దెకు) ఇవ్వడానికి వీలులేదు. లబ్ధిదారుని కుటుంబం మాత్రమే అందులో నివసించాలి.
తనిఖీలు: నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం సదరు ఫ్లాట్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు కలిగి ఉంటుంది.
పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ మరియు ప్రభుత్వ సబ్సిడీతో లభిస్తున్న ఈ అవకాశాన్ని CURE పరిధిలోని అర్హులైన పేద కుటుంబాలన్నీ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. మరిన్ని వివరాలకు ఇందిరమ్మ కి సంబందించిన పోస్ట్స్ చూడగలరు.
