తెలంగాణాలో త్వరలో వీ ఆర్ ఓ ల నియామకం. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం మరింత వేగంగా మారబోతుంది. కొన్ని లక్షల మంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో తెలంగాణా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్తగా వచ్చిన మార్పులకు అనుగుణంగా, గవర్నమెంట్ సేవల నిమిత్తం చాలా మంది అవసరం పడే అవకాశం ఉన్నందునా, తెలంగాణా ప్రభుత్వం త్వరలోనే వీ ఆర్ ఓ లా నియామకానికి సర్వం సిద్దం చేసింది.
ప్రతి గ్రామానికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించడం, పొందుపరచడం, మెరుగైనా సేవలను అందించడానికి ఈ నియామకాలను ప్రవేశ పెట్టింది. దేనికి గాను త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. భూ సమస్యల పరిష్కారం కొరకు, వేగవంతమైన సేవల కోసం ప్రభుత్వం అన్నివర్గాల వారితో చర్చలు జరిపి, భూభారతి చట్టాని అమలు చేయగా, ఈ చట్టం సమర్దవంతంగా అమలయ్యేందుకు వచ్చే నెలలో దాదాపుగా 10956 పోస్ట్స్ లకు సర్వం సిద్దం చేసింది. గ్రామ రెవిన్యూ ఆఫీసర్స్ లను, అలాగే, లైసెన్స్ డ్ సర్వేయర్ లను భూ భారతి కింద అమలు చేయాలనీ ఆలోచలనలో ఉంది. భూ భారతి అవగాహనా సదస్సులో తెలంగాణా రాష్ట రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ధరణి పోర్టల్ వాళ్ళ ప్రజలు ఎంతో బాధను అనుభవించారు, ధరణి అవకతవలకు హద్దు లేకుండా పోయింది. అలాంటి అవకతవకలు మళ్ళి పునర్వతం కాకుండా, ప్రవేశ పెట్టిన భూ భారతి అన్ని సమస్యలకు ఒకే పుల్ స్టాప్ పెట్టేలా ఉంటుందని తెలంగాణా రాష్ట రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
గ్రామాలలో భూ వివాదాలు పరిష్కరించే విధంగా, ప్రతి గ్రామ రెవిన్యూ అధికారి పని చేయాలి. త్వరలోనే అన్ని సదుపాయాలు కల్పించి, సరిపడా మందిని నియామకం జరపాలని ఆదేశించారు.
- గ్రామ రెవిన్యూ ఆఫీసర్స్ VRO కోసం అప్లై చేయడం ఎలా ?
- అప్లై చేయడానికి కావాల్సిన విద్య అర్హతలు ఏంటి ?
- తెలంగాణా VRO JOB అప్లై చేయడానికి కావాల్సిన వయసు ? కావాల్సిన డాకుమెంట్స్ ?
- VRO అప్లికేషను ఫారం ఎప్పటి నుండి అందుబాటులో వస్తుంది.
- తెలంగాణా VRO అప్లై చేయడానికి చివరి తేది ?