తెలంగాణ జెన్‌ కో లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసింది. బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. tsgenco assistant engineer recruitment

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు &  ఖాళీలు:

అసిస్టెంట్ ఇంజినీర్: 339 పోస్టులు (లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్- 94 ఖాళీలు, జనరల్ రిక్రూట్‌మెంట్- 245 ఖాళీలు)

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.

అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ పవర్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.




వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.65,600 – రూ.1,31,220.

ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.400.

ముఖ్యమైన తేదీలు:




ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు ప్రారంభం: అక్టోబర్ 07, 2023

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 07, 2023

ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబర్ 29, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 29, 2023

రాత పరీక్ష తేదీ: 03-12-2023.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

****************

More Jobs:

tsgenco assistant engineer recruitment