Indian Modern History – జాతీయ ఉద్యమ ఆవిర్భావం (1885–1905) – మితవాద యుగం

ఇండియన్ పాలిటి మోడరన్ చరిత్ర గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. దాంట్లో జరిగిన అన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కలిసి చదువుకుందాం, కలిసి నేర్చుకుందాం లో భాగంగా ఈరోజు మనం  జాతీయ ఉద్యమ ఆవిర్భావం (1885–1905) – మితవాద యుగం గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ భావన పెరిగి, దేశం కోసం ఏర్పడిన రాజకీయ ఉద్యమాన్నే జాతీయ ఉద్యమం అంటారు.

భారత జాతీయ ఉద్యమం ప్రధానంగా మూడు దశలుగా విభజించబడింది.

దశ కాలం
మితవాద యుగం 1885–1905
అతివాద యుగం 1905–1919
గాంధీయుగం 1919–1947

మితవాద యుగం (1885–1905)

ఈ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు విన్నపాలు, తీర్మానాలు, చర్చలు, విజ్ఞప్తులు వంటి రాజ్యాంగబద్ధమైన పద్ధతుల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంస్కరణలు చేయాలని కోరారు.

అందువల్ల వీరిని Moderates (మితవాదులు) అంటారు. మితవాదుల ఉద్దేశం సమస్యను సున్నితంగా, పరిష్కరించుకోవాలని, బ్రిటిష్ వాళ్ళతో బుజ్జగిస్తూ వాళ్ళ చర్చలు జరపాలని అనుకున్నారు.

మితవాదుల ముఖ్య లక్షణాలు

  • బ్రిటిష్ న్యాయవ్యవస్థపై విశ్వాసం
  • హింసను వ్యతిరేకించడం
  • రాజ్యాంగబద్ధమైన మార్గాలను అనుసరించడం
  • వినతిపత్రాలు సమర్పించడం
  • సమావేశాలు నిర్వహించడం
  • ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించడం
  • పత్రికల ద్వారా అవగాహన పెంచడం

వినతి పత్రాలు సమర్పిస్తూ, సమావేశాలు నిర్వహిస్తూ, హింస లేకుండా మన భారత దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని ప్రయత్నాలు చేసారు.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

  • స్థాపన సంవత్సరం – 1885
  • స్థాపకుడు – అలన్ ఆక్టేవియన్ హ్యూమ్
  • మొదటి సమావేశం – ముంబై
  • తేదీ – 28–31 డిసెంబర్ 1885
  • అధ్యక్షుడు – డబ్ల్యూ.సి. బెనర్జీ
  • ప్రతినిధులు – 72 మంది

1. INC స్థాపన: ప్రాథమికాంశాలు (Basic Facts about INC Estabilishment)

  • స్థాపించిన తేదీ: 1885, డిసెంబర్ 28.

  • స్థాపకుడు: అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ (A.O. Hume). ఈయన ఒక విశ్రాంత బ్రిటిష్ ఐ.సి.ఎస్ (ICS) అధికారి.

  • మొదటి సమావేశం జరిగిన ప్రదేశం: బాంబే (ముంబై) లోని గోకుల్‌దాస్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాల.

    • నోట్: నిజానికి ఈ సమావేశం పూనా (పుణె) లో జరగాల్సి ఉంది, కానీ అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలడంతో వేదికను బాంబేకు మార్చారు.

  • మొదటి అధ్యక్షుడు: డబ్ల్యూ. సి. బెనర్జీ (ఉమేష్ చంద్ర బెనర్జీ).

  • హాజరైన ప్రతినిధులు: దేశవ్యాప్తంగా మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

  • అప్పటి వైస్రాయ్: కాంగ్రెస్ ఏర్పాటయ్యే నాటికి భారతదేశ వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్

  • తొలి అధ్యక్షుడు: ఉమేష్ చంద్ర బెనర్జీ (W.C. Bonnerjee).

  • తొలి జనరల్ సెక్రటరీ: ఏ.ఓ. హ్యూమ్ (A.O. Hume)

  • నాటి వైస్రాయ్: ఐఎన్‌సీ స్థాపన సమయంలో భారతదేశ వైస్రాయ్‌గా లార్డ్ డఫ్రిన్ (Lord Dufferin) ఉన్నాడు.
  • ముఖ్య నాయకులు: దాదాభాయ్ నౌరోజీ, దిన్షా వాచా, కాశీనాథ్ త్రయంబక్ తెలంగ్, ఫిరోజ్‌షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ మొదలైనవారు.

మొదటి సమావేశంలో ఐఎన్‌సీ బ్రిటిష్ ప్రభుత్వానికి కొన్ని కీలక విన్నపాలు చేసింది.

  • కేంద్ర, ప్రాంతీయ శాసనసభల విస్తరణ, వాటిలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడం.

  • ఐసీఎస్ (ICS) సివిల్ సర్వీసెస్ పరీక్షలను లండన్‌తో పాటు భారతదేశంలో కూడా ఒకేసారి నిర్వహించడం.

  • సైనిక వ్యయాన్ని తగ్గించడం.

  • పరిపాలన మరియు న్యాయవ్యవస్థలను వేరు చేయడం.

  • ల్యాండ్ రెవెన్యూ (భూమి శిస్తు) తగ్గించడం.

మితవాదుల ప్రముఖ నాయకులు

1. దాదాభాయి నౌరోజీ

  • భారత జాతీయ ఉద్యమ పితామహుడు (Grand Old Man of India)
  • Drain Theory (భారతదేశ సంపద ప్రతి సంవత్సరం ఇంగ్లాండ్‌కు తరలిపోతుందని వివరించాడు.) ప్రతిపాదించాడు.
  • బ్రిటిష్ ఆర్థిక దోపిడీని మొదటిసారి శాస్త్రీయంగా వివరించాడు.

2. సురేంద్రనాథ్ బెనర్జీ

  • రాజకీయ చైతన్యానికి కృషి చేశాడు.
  • ప్రజాసభలు నిర్వహించాడు.

3. ఫిరోజ్‌షా మెహతా

  • కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేశాడు.
  • స్థానిక స్వపరిపాలనకు మద్దతు ఇచ్చాడు.

4. గోపాలకృష్ణ గోఖలే

  • మితవాద నాయకులలో అత్యంత ప్రముఖుడు.
  • Servants of India Society స్థాపించాడు.
  • తరువాత మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా గుర్తించాడు.

మితవాదుల వైఫల్యాలు

  • బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువ డిమాండ్లను తిరస్కరించింది.
  • ప్రజల భాగస్వామ్యం తక్కువగా ఉండేది.
  • ఉద్యమం చదువుకున్న మధ్యతరగతికే పరిమితమైంది.
  • బ్రిటిష్ ప్రభుత్వంపై ఎక్కువ నమ్మకం ఉంచారు.
  • స్వరాజ్యాన్ని వెంటనే డిమాండ్ చేయలేదు.

మితవాద యుగం ముగియడానికి కారణాలు

  • బెంగాల్ విభజన (1905)
  • బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి
  • యువతలో అసంతృప్తి పెరగడం
  • స్వదేశీ ఉద్యమం ప్రారంభం
  • అతివాద నాయకుల ఎదుగుదల
సంవత్సరం సంఘటన
1885 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
1885 మొదటి కాంగ్రెస్ సమావేశం
1886 రెండవ సమావేశం – కలకత్తా
1892 భారత కౌన్సిల్స్ చట్టం
1905 బెంగాల్ విభజన
1905 మితవాద యుగం ముగింపు

ముఖ్యమైన వ్యక్తులు

వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం
దాదాభాయి నౌరోజీ Grand Old Man of India, Drain Theory
A.O. హ్యూమ్ కాంగ్రెస్ స్థాపకుడు
డబ్ల్యూ.సి. బెనర్జీ తొలి కాంగ్రెస్ అధ్యక్షుడు
గోపాలకృష్ణ గోఖలే Servants of India Society
ఫిరోజ్‌షా మెహతా కాంగ్రెస్ ప్రముఖ మితవాది
సురేంద్రనాథ్ బెనర్జీ రాజకీయ చైతన్య నాయకుడు

మితవాదుల గురించి కొన్ని ప్రశ్నలు

1. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది?
A) 1884
B) 1885
C) 1886
D) 1905

2. భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు?
A) దాదాభాయి నౌరోజీ
B) గోఖలే
C) డబ్ల్యూ.సి. బెనర్జీ
D) ఫిరోజ్‌షా మెహతా

3. Drain Theoryని ప్రతిపాదించినవారు ఎవరు?
A) గోఖలే
B) తిలక్
C) దాదాభాయి నౌరోజీ
D) ఆర్.సి. దత్

4. మితవాద యుగం ఏ సంవత్సరాల మధ్య కొనసాగింది?
A) 1885–1905 ✅
B) 1905–1919
C) 1919–1947
D) 1875–1895

5. మితవాదుల ఉద్యమ పద్ధతి ఏది?
A) సాయుధ పోరాటం
B) అసహకార ఉద్యమం
C) ప్రార్థనలు, వినతిపత్రాలు, తీర్మానాలు
D) శాసనోల్లంఘన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *