Telangana Anganwadi Teachers Helpers Jobs Notification Latest
తెలంగాణ అంగన్వాడి టీచర్స్ , హెల్పర్స్ పోస్ట్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఈరోజు ఉద్యోగ కల్పనలో పెద్దపీట వేస్తుంది. జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఎప్పుడూ లేనంతగా, అర్హులలందరికి ప్రభుత్వ పథకం అందేలా కృషి చేస్తుంది. ఉద్యోగ కల్పన లో భాగంగా అంగన్ వాడి స్కూల్స్ కి టీచర్స్, హేల్పర్స్ పోస్ట్స్ భర్తీకి భారి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ శిశు సంక్షేమ స్కీం కింద మహిళలకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మంత్రి సీతక్క గారు ప్రకటన విడుదల చేసారు. తెలంగాణా అంగన్ బడి పోస్ట్స్ జాబ్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Telangana Anganwadi Teachers, Helpers Jobs Notification Apply Online
గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS) కార్యక్రమం కింద అంగన్వాడీ స్కూల్స్ లో, టీచర్స్, హేల్పర్స్ గురించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది . మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (WCD) త్వరలో రాష్ట్రాల వారీగా WCD అధికారిక పోర్టల్ల ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తుంది. అర్హులు / ఆశక్తి గల మహిళలు ఆన్లైన్ offline లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ మరియు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అర్హత గల అభ్యర్థులు వర్కర్లు, సహాయకులు, ఉపాధ్యాయులు, సూపర్వైజర్లు మరియు ఆశా వర్కర్లతో సహా వివిధ అంగన్వాడీ స్థానాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ రకముల పోస్ట్స్ కి, ఎంపిక విధానం, వయసు పరిమితి, జీతం వేరు వేరుగా ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు అధికారిక అంగన్వాడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025ని జాగ్రత్తగా చదవాలని సూచించారు. అధికారిక వెబ్సైటు లో ఉన్న నోటిఫికేషన్ లో అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. మీకోసం ఇక్కడ ఇస్తున్నాము. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ అంగన్వాడి ఉద్యోగం కొరకు అప్లై చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు :
- అప్లై చేసుకునే అభ్యర్థిని తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
- మహిళా దరఖాస్తుదారులు / అభ్యర్థి వయసు 21 సంవత్సరాల కి తగ్గకుండా, 35 సంవత్సరాలకి మించకుండా ఉండాలి. వయస్సు సడలింపులు పరిమితిలో ఉంటాయి.
- అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలాయి ఉండాలి. ( పెళ్లి అయి ఉండాలి ) పెళ్లి అయ్యాక ఏ ఊరులో ఉంటుందో, అదే ఊరు నుండి అప్లై చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి నుండి చేసుకోవడానికి అవ్వదు, అత్తంటి నుండి చేసుకోవాలి.
- తెలంగాణ రాష్ట్రం విడుదల చేయనున్న అంగన్ వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మహిళలు మాత్రమే అర్హత ఉంది. అంగన్ వాడీ టీచర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్, అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగాలకు 10వ తరగతి చదివిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. రూరల్ ప్రాంతం అయితే, గ్రామ పంచాయతి పరిధిలో నివసిస్తూ ఉండాలి.
- ఎంపిక చేయు విధానంలో 21 సంవత్సరాల వాళ్ళు ఎవరు లేకపోతే, 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇది కేవలం SC, ST లకు మాత్రమే వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. కేవలం విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు
- Date of Birth Certificate
- Caste Certificate issued by Meeseva
- SSC MEMO
- Residential Certificate
- if Orphan, Orphan Certificate
- If Widow, Widow Certificate
- if Physically Handicapped, SADAREM Certificate
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనున్న అంగన్ వాడీ పోస్టులకు ఎంపికైన వారికి అంగన్ వాడీ టీచర్లకు అయితే రూ.12,500/- నుంచి రూ.13,500/- వరకు ఉంటుంది. అంగన్ వాడీ హెల్పర్లకు రూ.8000/- జీతం అయితే ఇస్తారు
Post Comment