TSRTC Drivers Contract Out-Sourcing Jobs Urgent Recruitment Depo Wise

tsrtc outsourcing contract jobs

తెలంగాణ రాష్ట రోడ్ రవాణా సంస్థ TGSRTC కాంట్రాక్టు డ్రైవర్స్ కోసం చూస్తుంది. రెగ్యులర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలిసిందే. అంతలోపు రోజువారీ అవసరాలకు ఉన్న డ్రైవర్స్ సరిపోవట్లేదు అని, ఔట్ సోర్సింగ్ పద్దతిలో డ్రైవర్స్ నియామకం జరపాలని చూస్తుంది.

TSRTC డ్రైవర్ & కండక్టర్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ లో అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. TSRTC వివిధ 3000+ బస్ డ్రైవర్లు మరియు కండక్టర్ల పోస్టుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అర్హతలు, ఉద్యోగ వివరాలు అన్ని నోటిఫికేషన్ పోస్ట్స్ ప్రకారంగా ఉండగా, ఇప్పుడు అర్జెంటు బేసిక్ మీద కొందరిని కాంట్రాక్టు పద్దతిలో డ్రైవర్స్ నియామకానికి TGSRTC నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి గాను హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్న మరియు 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ RTC బస్సు డ్రైవర్స్ కి ఉండవలసిన అన్ని సదుపాయాలు వీళ్ళకు కూడా ఉంటాయి, కానీ రెగ్యులర్ జాబ్స్ ల పరిమితి లా కాకుండా ఉంటాయి.

TGSRTC రిక్రూట్‌మెంట్ అర్హత 2025

TGSRTC నియామకానికి సమయం పడుతుంది అని గమనించిన TGSRTC ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం చూస్తుంది. మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ) సదుపాయం వాళ్ళ, రవాణా పెరగడమే కాకుండా, జనాలు అటు ఇటు తిరగడం తో, Express బస్సు లో, సీట్ దొరకని పరిస్థితి వచ్చింది. కొన్ని బస్సు లు, దాని స్తోమతని మించి ఎక్కువ కెపాసిటీ బరువును మోయాల్సి వస్తుంది, దిని కారణంగా కొన్ని పాత బస్సు లు, తొందరగా పాడయ్యాయి. ఇప్పుడు కొత్త బస్సు , ఛార్జింగ్ బస్సు లు, EV-మోడల్ అంటూ కొత్త బస్సు లను ప్రవేశం చేయించారు. ఈ సౌకర్యాలకు ఉన్న డ్రైవర్స్ ఎక్స్ట్రా డ్యూటీ చేసిన సరిపోవట్లేదు. అందుకేకొత్త వాటిని నియామకం కావాల్సిందే అని, ప్రస్తుతం అన్ని రూట్లలో బస్సు లు పెంచడం జరిగింది. బస్సు కావలసినన్ని ఉన్న, దాని డ్రైవర్ ల కొరత మాత్రం అలానే ఉండిపోయింది. ఒక పక్క ప్రయాణికుల పెరుగుతూ వస్తుంది, డ్రైవర్స్ లా కొరత పెరుగుతుంది.

ఈ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ విధానంతో అయిన డ్రైవర్స్ బాధలు తప్పుతాయని RTC భావిస్తుంది. ప్రతి జిల్లలో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అంతకు ముందు, ఔట్ సోర్సింగ్ డ్రైవర్స్ లను, maintaince వర్క్స్ కి మాత్రమే వాడుకునే వాళ్ళు, డిపో నుండి బస్సు లు తీసుకొని రావడం, బస్సు లను కావాల్సిన స్టాప్ లో పెట్టడం, పెళ్ళిలకు, ఫంక్షన్ లకు ఎవరైనా బస్సు లు హైర్ చేసుకుంటే వాళ్ళకి పంపడం లాంటివి జరుగుతూ ఉండేవి. ఈసారి మాత్రం వాళ్ళకి పబ్లిక్ స్త్రిరింగ్ ఇచ్చే ఒప్పదం కూడా జరిగింది. మొదటగా 200 డ్రైవర్స్ కాంట్రాక్టు పద్దతిలో తీసుకొని, మొదట ప్రయత్నంగా పెద్ద డిపోల నుండి ప్రయోగం చేయనున్నారు. ఇది మంచి పలితాలు ఇస్తే, ప్రతి డిపో నుండి కనీసం 5 మంది డ్రైవర్స్ ని కొత్తగా అవుట్ సోర్సింగ్ పద్దతిలో తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ఆసక్తిగల అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర రోడ్ & ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ @tgsrtc.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి TSRTC డ్రైవర్ కండక్టర్ రిక్రూట్‌మెంట్ 2025 గురించి, దాని అర్హత, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమైనా అనుమానాలు ఉంటె, కింద కామెంట్ రూపంలో తెలపగలరు. దేనికి గాను, దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 22 సంవత్సరాలు తగ్గకుండా, 60 వయసు మించకుండా ఉండాలి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అనుభవం ఉన్న డ్రైవర్స్ పెద్ద పీట వేసే అవకాశం ఉంది. అలాగే డ్రైవర్ ఫిట్నెస్ కూడా దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. దినికిగాను ఎత్తు 160 సెం.మీ లకు తగ్గకుండా ఉండాలి. కనీసం తెలుగు, హిందీ మాట్లాడగలగాలి. ఇంగ్లీష్ కొద్దిగా అర్థం చేసుకునేంత ఉన్నంతన సరిపోతుంది.

ఈ నియామకాలకు అభ్యర్థులు వాళ్ళ ఒరిజినల్ ద్రువపత్రాలు , లైసెన్స్ లు ఇవ్వవలసి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ డిపో మేనేజర్ ముందు, RTO సమక్షంలో చేయాల్సి ఉంటది. ఎంపికైన వారికీ రెండు వారాలు డిపో నందు స్పెషల్ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో ప్రతి అంశం పైన వివరిస్తారు. రూట్ మ్యాప్, టికెట్ ఫేర్, స్టాప్ లు, రిక్వెస్ట్ స్టాప్ లు, డ్యూటీ టైమింగ్ లు అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. దేనికి జితంగా 22,415 రూపాయలు చెల్లిస్తామని నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది. దేనికి పూర్తి బాధ్యత కరీంనగర్ రీజినల్ RTC డిపో నుండి జరుగుతుంది. మిగతా వివరాలకు డిపో మేనేజర్ ను, లేదా మీ దగ్గరలో గల జిల్లా ఉపాది కార్యాలయం ని సంప్రదించవచ్చు.

Post Comment