ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ఆఫీస్ GPO పోస్టల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ లేటెస్ట్
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ రిక్రూట్మెంట్ వివరాలు, గ్రామీన్ డాక్ సేవక్ పది తరగతి అర్హతతో కూడా ఉద్యోగాలు. ఎలాంటి ఎగ్జామ్స్ లేకుంటే మార్క్స్ మెరిట్ ఆధారంగా ఉద్యోగం పొందే అవకాశం. AP పోస్టల్ సర్కిల్ GDS ఖాళీల నియామకం కోసం నోటిఫికేషన్ 2025 ను ప్రచురించింది. ఈ క్రింది ఖాళీలకు ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం, పూర్తి సిలబస్‌ను, వయసు పరిమితులు, వయసు సడలింపులు, జీతం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ GDS భారతి కోసం రిక్రూట్మెంట్: ఆంధ్రప్రదేశ్ పోస్టాఫీసులలో భారి మొత్తం లో ఉన్న ఖాళీల కోసం గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి, @www.indiapost.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. AP పోస్టల్ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రామీణ డాక్ సేవక్ నియామకం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. AP పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్లో రాబోయే గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను వివరాలను, దరఖాస్తు చేయడానికి కావాల్సిన డాకుమెంట్స్ వివరాలు,. AP పోస్టల్ సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ నియామక పక్రియ, పూర్తిస్థాయి వివరాలు తెలుసుకోండి.
AP పోస్టల్ సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ – AP పోస్టల్ సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ ఇటీవల గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్‌కు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఆక్టివేట్ చేయడం జరిగింది. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు.
పని వివరాలు
డ్యూటీ టైం 4 గంటలు మాత్రమే. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం ఉంటుంది. జీతం కాకుండా, ప్రతి వర్క్స్ కి కమిషన్ బేస్డ్ లాగా క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజు వారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. వర్క్ లొకేషన్ మారుతూ ఉంటుంది. దాని పైన ఆధారిపడి ఉండేలా, పని స్థల మార్పిడి, ట్రాన్స్ఫర్ లు జరుగుతాయి.
ముఖమైన వివరాలు :
ఆంధ్ర ప్రదేశ్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కి కావాల్సిన విద్యార్హతలు: అభ్యర్థి పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. పేమెంట్, టెక్నాలజీ కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి.
పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కి కావాల్సిన వయసు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 18- 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: జీతం అనేది పోస్ట్ ను అనుగుణంగా ఉంటుంది. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380.. ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు లేదు. మిగిలిన జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్ సర్కిల్లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయనే విషయాన్ని గమనించాలి.
మరిన్ని ఉద్యోగ వివరాల కోసం, మన JobsTelugu.com ని ఫాలో అవ్వండి.
Post Comment